గండిపేట్ కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌లో కోటి లక్ష పలికిన గణనాథుడి లడ్డూ

రిపోర్టర్: సురేష్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా గండిపేట్ పరిధిలోని రాజేంద్రనగర్ సర్కిల్ కీర్తీ రిచ్‌మండ్ విల్లాస్‌లో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన గణనాథుడి లడ్డూ వేలంపాట ఉత్కంఠభరితంగా సాగింది. మంగళవారం అర్ధరాత్రి వరకు హోరాహోరీగా జరిగిన ఈ వేలంలో శక్తిమాన్ టీమ్ ఏకంగా రూ.1.01 కోట్లకు లడ్డూను దక్కించుకుంది. దియా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేలం ద్వారా వచ్చే నిధులను దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుండటం విశేషం.