కొమ్మమూరు బ్రిడ్జి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆర్ అండ్ బి అధికారుల బృందం
రిపోర్టర్: రాము
స్థలం: గుంటూరు
భారీ వాహనం ఢీకొనడంతో దెబ్బతిని మరమ్మతులు చేపట్టిన కొమ్మమూరు బ్రిడ్జి పనుల నాణ్యతను ఆర్ అండ్ బి శాఖ ఎస్ఈ, ఈఈ తదితర అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ వెల్లడించారు. పొన్నూరు వైపు దెబ్బతిన్న రెండో స్పాన్‌కు సంబంధించిన డెక్ స్లాబ్‌ను పునర్నిర్మించాలని, తక్షణమే తగిన మరమ్మతులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వేగంగా పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.