ఉత్తరాఖండ్‌లో భార్యను కాల్చిచంపి పోలీసులకు ఫోన్ చేసిన భర్త
రిపోర్టర్: హరి
స్థలం: Uttarakhand
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని క్లెమెంట్ టౌన్ ప్రాంతంలో దీరజ్ పన్వార్ అనే వ్యక్తి తన భార్య కాజల్ పన్వార్‌ను కాల్చిచంపి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. సోమవారం ఉదయం సుభాష్ నగర్ సత్యసాయి ఆలయం సమీపంలో ఈ ఘటన జరిగింది. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, మృతురాలి కుటుంబం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ ప్రాంతానికి చెందినదిగా పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.