రూపాయి వెయ్యి నోటుపై సోషల్ మీడియా ప్రచారం అవాస్తవం: పీఐబీ
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
కొత్తగా వెయ్యి రూపాయల నోటు విడుదల కానుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ఎక్స్ వేదికగా స్పష్టతనిచ్చింది. పసుపు రంగులో, ఆలయం చిత్రంతో కూడిన కొత్త కరెన్సీ నోటును ఆర్బీఐ జారీ చేయలేదని తేల్చిచెప్పింది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మవద్దని, అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ సంస్థల ప్రకటనలను మాత్రమే పరిశీలించాలని నిపుణులు సూచించారు.