క్రికెట్ లో మరోసారి షెడ్యూల్ వివాదం: ఐపీఎల్ తో పీఎస్ఎల్ సమరం
రిపోర్టర్: రమేష్
స్థలం: New Delhi
పాకిస్థాన్ సూపర్ లీగ్ పన్నెండో సీజన్ షెడ్యూల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీతో మరోసారి ఘర్షణ పడే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. మార్చి పద్దెనిమిది నుంచి మే రెండు వరకు ఈ లీగ్ నిర్వహించనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. అయితే ఐపీఎల్ కూడా మార్చి మధ్యలోనే ప్రారంభించాలని బీసీసీఐ యోచిస్తుండటంతో ఆటగాళ్లు, ప్రసార హక్కుల విషయంలో రెండు లీ్రగ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.