శేఖర్ కమ్ముల హీరోలు నాకు అస్సల నచ్చరు: సందీప్ రెడ్డి వంగ

రిపోర్టర్: రాము స్థలం: తెలంగాణ

దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోల పాత్రలు తనకు అసలు నచ్చవని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన సినిమాల్లోని హీరోయిన్లను మాత్రం ఇష్టపడతానని స్పష్టం చేశారు. ఓ ప్రీ-రిలీజ్ వేడుకలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. నెటిజన్లు వంగా వ్యాఖ్యలపై భిన్నంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.