దానం నాగేందర్ అనర్హత పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిరాయింపు వ్యవహారంపై హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ తరఫున లోక్‌సభకు పోటీచేసిన దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు.