'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమం రద్దు: గాంధీభవన్‌ ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

గాంధీభవన్‌లో ఈ వారం జరగాల్సిన 'ప్రజలతో ముఖాముఖి' కార్యక్రమం రద్దు అయినట్లు తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. భారత ఉప రాష్ట్రపతి రాష్ట్రానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రోటోకాల్ విధులతో పాటు, తెలంగాణ విలీన దినోత్సవ అధికారిక కార్యక్రమాలలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ పాల్గొనాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.