బసంతపురం ఆదర్శ గ్రామం.. కలెక్టర్ ఆకస్మిక పరిశీలన!
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బసంతపురం గ్రామాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద జరుగుతున్న సర్వే విధానాన్ని పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి విద్యార్థులతో ముచ్చటించి సదుపాయాలపై ఆరా తీశారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు నూతన రేషన్ దుకాణంతో పాటు డ్రైనేజీ, అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సర్పంచ్ మెండు రత్నమాల సత్తిరెడ్డిని కలెక్టర్ అభినందించారు.