కుష్టు వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

రిపోర్టర్: సునీల్ స్థలం: తిరుపతి

కుష్టు వ్యాధి రహిత దేశంగా భారతదేశాన్ని నిలబెట్టేందుకు అందరూ భాగస్వాములు కావాలని జిల్లా అదనపు డీఎం అండ్ హెచ్‌వో ఖాదర్ వలి పిలుపునిచ్చారు. పొదలకూరు మండలం మహమ్మదాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సెప్టెంబర్ 11 నుంచి 24 వరకు నిర్వహించనున్న కుష్టు వ్యాధి కేసుల గుర్తింపు సర్వేను గ్రామాల్లో సమర్థవంతంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోవాలని సూచించారు.