ప్రాదేశిక పోరుకు నామపత్రాల స్వీకరణ ప్రారంభం: తొలి రోజు 228 మంది దాఖలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో ప్రాదేశిక ఎన్నికల నామపత్రాల స్వీకరణ ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు వివిధ స్థానాలకు మొత్తం 228 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. జడ్పీ కార్యాలయం వద్ద పటిష్ఠ పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎన్నికల నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఎస్పీ స్పష్టం చేశారు.