జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా వెండి వినాయక ఉత్సవాలు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ హితంగా వెండి వినాయక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 25 కిలోల వెండితో తయారు చేసిన గణపతితో పాటు మహాలక్ష్మి, సరస్వతి దేవి ప్రతిమలను మేళతాళాల మధ్య పురవీధుల గుండా ఊరేగించారు. వాసవి గార్డెన్లో ఏర్పాటు చేసిన మండపంలో 108 బంగారు పుష్పాలతో స్వామివారికి వేదమంత్రాల మధ్య విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు.