సిద్దిపేటలో అక్టోబర్ 1 నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమన్న లక్ష్మీ కిరణ్

రిపోర్టర్: నరేష్ స్థలం: సిద్దిపేట

సిద్దిపేట జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం కొనుగోళ్లు అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్ స్పష్టం చేశారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో అధికారులతో నిర్వహించిన ముందస్తు సమన్వయ సమావేశంలో ఆమె ఈ కీలక ప్రకటన చేశారు. సన్నరకం ధాన్యం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ కొలిచే యంత్రాలు, గన్నీ బ్యాగులు, లారీలు సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆమె అధికారులను ఆదేశించారు.