ఒడిశా సివిల్ సర్వీసెస్ పరీక్షలు వాయిదా వేసేది లేదన్న ప్రభుత్వం
రిపోర్టర్: మహేష్
స్థలం: Bhubaneswar
ఒడిశాలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సివిల్ సర్వీసెస్ ప్రధాన పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి సురేష్ పూజారి స్పష్టం చేశారు. అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పరీక్ష వాయిదా పడితే మరో ఆరు నెలలు ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు.