కుటుంబంతో కలిసి వినాయక చవితి వేడుకలు జరుపుకున్న గెటప్ శ్రీను

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

ప్రముఖ కమెడియన్ గెటప్ శ్రీను వినాయక చవితి వేడుకలను కుటుంబంతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. భార్య సుజాత, కొడుకు హేమాన్ష్ కార్తికేయన్‌లతో కలిసి వినాయక విగ్రహంతో దిగిన అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.