'జాబ్ క్యాలెండర్ ఏమైంది?.. నిరుద్యోగులను మోసం చేస్తున్నారు': ఏపీ ప్రభుత్వంపై విమర్శలు
రిపోర్టర్: శివ
స్థలం: Amaravati
జాబ్ క్యాలెండర్లో భాగంగా ప్రకటించిన పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని భావించినప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు వేగవంతం చేయకపోవడంపై నిరుద్యోగులు మరియు విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, నిరుద్యోగ యువతను నిత్యం మోసం చేస్తున్నారని నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా వెంటనే జాబ్ క్యాలెండర్ అమలు చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.