ప్రయాణికులకు తీపి కబురు: విశాఖ-పార్వతీపురం మధ్య ప్రత్యేక రైళ్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయనగరం
దీపావళి మరియు వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖపట్నం నుంచి పార్వతీపురం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల ఏడు, ఎనిమిది, తొమ్మిదవ తేదీల్ లో ఈ ప్రత్యేక సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని పేర్కొన్నారు. సింహాచలం, కొత్తవలస, విజయనగరం మీదుగా నడిచే ఈ రైలు వేళలను గమనించి ప్రయాణికులు తగిన సదుపాయం పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.