కేదార్నాథ్ ఆలయ సందర్శన కలకలం: నటి సారా అలీఖాన్కు ఫత్వా

రిపోర్టర్: గోపి స్థలం: उत्तराखंड

బాలీవుడ్ నటి సారా అలీఖాన్ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడంపై ఆల్ ఇండియా ముస్లిం జమాత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సంస్థ అధ్యక్షుడు మౌలానా మఫ్తీ రజ్వీ తెలిపారు. ఇస్లాం షరియాకు వ్యతిరేకంగా ఇతర మతాల ఆచారాలు పాటించినందుకు గాను ఆమెకు ఫత్వా జారీ చేశామని, వెంటనే అల్లాహ్ను క్షమాపణ కోరాలని ఆయన స్పష్టం చేసినట్లు వెల్లడించారు.