కాశీలో వాయుసేన విన్యాసాలు దేశ ఆత్మగౌరవాన్ని చాటాయని ఈటల రాజేందర్ కొనియాడారు

రిపోర్టర్: సునీల్ స్థలం: మేడ్చల్ మల్కాజిగిరి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వారణాసి పర్యటన సందర్భంగా కాశీ ఘాట్ల వద్ద పోటెత్తిన జనసందోహం, ఆకాశంలో భారతీయ వాయుసేన ప్రదర్శించిన అద్భుతమైన విన్యాసాలు దేశ సామర్థ్యాన్ని, జాతీయ వైభవాన్ని ఘనంగా చాటాయని మేడ్చల్ మల్కాజిగిరి నేత ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా స్పందించిన ఆయన, పది లక్షల మందికి పైగా ప్రజల సమక్షంలో జరిగిన కాశీ ఎయిర్ షో దేశ ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా అద్భుతంగా సాగిందని ప్రశంసించారు.