భారత ఆర్థిక వృద్ధి అంచనాలను పెంచిన మూడీస్ రేటింగ్స్

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

యుద్ధ వాతావరణంతో ప్రపంచ దేశాలు సతమతమవుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశ జీడీపీ వృద్ధి అంచనాలను ఆరు శాతం నుండి ఏడు శాతానికి మూడీస్ సంస్థ పెంచింది. ప్రైవేట్ వినియోగం పుంజుకోవడం, మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు, సేవా రంగంలో స్థిరమైన వృద్ధి ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొంది.