ప్రజా పాలన సంక్షేమ ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. సీఎల్పీ సమావేశంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ పిలుపు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

సీఎల్పీ సమావేశంలో కాంగ్రెస్ శాసనసభ్యులతో వెయ్యి రోజుల ప్రజా పాలన, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించాను. SIR పేరుతో ఓట్ల తొలగింపుపై ప్రతి ఎమ్మెల్యే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశాను. ప్రతిపక్షం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ ముందుకు సాగాలని, తెలంగాణ ప్రగతి కోసం మరింత పట్టుదలతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు.