ఐఐటీ బాంబే హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల తొలగింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
మహారాష్ట్రలోని ముంబై ఐఐటీ క్యాంపస్లో విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో హాస్టల్ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లను గోడ ఫ్యాన్లుగా మారుస్తున్నారు. గత వారం సాహిల్ వాకోడే అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటంతో ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది సాధారణ పునరుద్ధరణ పనేనని వర్గాలు చెబుతుండగా, ఎన్సీపీ నేత అనీశ్ గావండే ఫ్యాన్లను మార్చడం వల్ల సమస్య పరిష్కారం కాదని, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రశ్నించారు.