అమెరికాలో ఘనంగా దసరా దీపావళి వేడుకలు: అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Massachusetts
గ్రేటర్ బోస్టన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో మసాచుసెట్స్‌లో దసరా, దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఐదు వందల మందికి పైగా స్థానిక తెలుగు ప్రజలు హాజరయ్యారు. గాయని స్పూర్తి జితేందర్ సంగీత కచేరీ, సప్త తాండవ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇదే వేదికపై సంస్థ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.