ఓట్ల తొలగింపుపై జ్ఞానేశ్ కుమార్ గోబ్యాక్ అంటున్నారంటూ రేవంత్ రెడ్డి నిప్పులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: న్యూఢిల్లీ
కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో దళితులు, గిరిజనులు, యువత ఓట్లను అక్రమంగా తొలగిస్తోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, జ్ఞానేశ్ కుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నామని తెలిపారు. ఈడీ, సీబీఐలను వాడిన మోదీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ను వాడుకుంటున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటం మరో స్వాతంత్య్రోద్యమం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.