ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగానికి తెలంగాణ విద్యాశాఖ ఆహ్వానం

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

అమెరికాలోని న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వారోత్సవాల సందర్భంగా నిర్వహించే మినిస్టీరియల్ బ్రేక్ ఫాస్ట్ సెషన్‌లో ప్రసంగించేందుకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాకు అరుదైన ఆహ్వానం అందింది. పాఠశాల విద్యలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ సంస్కరణలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడంతో ఈ వేదికపై రాష్ట్ర విద్యా విధానాన్ని ప్రపంచ ప్రతినిధుల ముందు ప్రదర్శించనున్నారు.