టీనేజర్ల ఆన్లైన్ భద్రత కోసం కొత్త ఫీచర్లు తెచ్చిన వాట్సాప్

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

టీనేజర్ల ఆన్లైన్ భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ శక్తివంతమైన పేరెంటల్ కంట్రోల్స్ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో పిల్లలు సైబర్ బెదిరింపులు, అనుచిత కంటెంట్కు లోనయ్యే ప్రమాదం పెరిగిన నేపథ్యంలో ఈ నూతన వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ ఫీచర్ ద్వారా పిల్లలు ఎవరితో చాట్ చేయాలి, ఏ గ్రూపుల్లో సభ్యులుగా ఉండాలనే విషయాలను తల్లిదండ్రులు నేరుగా నియంత్రించవచ్చని వాట్సాప్ అధికారులు వెల్లడించారు.