జడ్చర్లలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్ట్

రిపోర్టర్: మహేష్ స్థలం: జడ్చర్ల

జూరాల ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్ట్ సందర్శనకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును జడ్చర్ల సమీపంలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌ను నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు 44వ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం ఆయనను పోలీసులు జడ్చర్లలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు.