కరణ్ షోలో విజయ్-రష్మిక బోల్డ్ ముచ్చట్లు!
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: India
పెళ్లి తర్వాత ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తొలిసారిగా కరణ్ జోహార్ నిర్వహించే ప్రముఖ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కొత్త సీజన్ లో సందడి చేయనున్నారు. బాలీవుడ్ స్టార్స్ కే పరిమితమైన ఈ షోలో నేషనల్ క్రష్ రష్మిక, విజయ్ లపై కరణ్ అడిగే బోల్డ్ ప్రశ్నలు, బెడ్ రూమ్ ముచ్చట్లపై ఎలాంటి వివాదాలు రేగుతాయనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.