బీఆర్‌ఎస్ నేతల పై ఉల్టా కేసులు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
అసెంబ్లీ గేటు వద్ద జరిగిన తోపులాట ఘటనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. హరీశ్‌రావు, కేటీఆర్সহ పలువురు బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డంపెట్టుకుని అక్రమ కేసులు బనాయించిందని బీఆర్‌ఎస్ తీవ్రంగా మండిపడింది.