శరన్నవరాత్రులు ప్రారంభం: నవదుర్గల ఆరాధనతో సకల విజయాలు చేకూరుతాయని పండితులు వెల్లడి

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం కానున్న దేవి నవరాత్రుల సందర్భంగా శక్తి ఆరాధన విశిష్టత సంతరించుకుంది. ఆదిశక్తిని నవదుర్గలుగా తొమ్మిది రూపాల్లో శ్రద్ధాభక్తులతో పూజిస్తే సకల విజయాలు, సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు వెల్లడించారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి తదితర రూపాల్లో భక్తులు అమ్మవారిని కొలిచి తరిస్తారని వారు పేర్కొన్నారు.