ప్రశ్నల రూపంలో ఉన్న ఆర్టీఐ దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేసిన కమిషన్
రిపోర్టర్: రమేష్
స్థలం: చిత్తూరు
సమాచార హక్కు చట్టం కింద ఇచ్చే దరఖాస్తు ప్రశ్నల రూపంలో ఉన్నప్పటికీ సమాచారాన్ని అందించాల్సిందేనని రాష్ట్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. కేవలం ఊహాజనిత ప్రశ్నలకు మాత్రమే స్పందించాల్సిన అవసరం లేదని రాష్ట్ర సమాచార కమిషనర్ వీఎస్కే చక్రవర్తి వెల్లడించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన దరఖాస్తుదారుడు దేవదాసు దాఖలు చేసిన రెండో అప్పీల్పై విచారణ సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. సర్వే నంబర్ల వివరాలు కోరిన బాధితుడికి ఏడు పనిదినాల్లోగా సమాచారం ఇవ్వాలని పీఐవోను ఆదేశించారు.