హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: డంపర్ ఢీకొని కాలేజీ విద్యార్థిని దుర్మరణం

రిపోర్టర్: గోపి స్థలం: Mumbai

ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో శ్రీష శెట్టి అనే పద్దెనిమిదేళ్ల కాలేజీ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని కస్తూర్బా మార్గ్ పోలీసులు వెల్లడించారు. కాలేజీ నుంచి స్నేహితుడితో కలిసి బైక్పై ఇంటికి వెళ్తుండగా డంపర్ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. డంపర్ డ్రైవర్ సద్దాం షేక్పై పోలీసులు కేసు నమోదు చేశారు.