నాని ప్యారడైజ్ సినిమా ప్రత్యేక షోకు ఏపీ ప్రభుత్వం అనుమతి
రిపోర్టర్: రాజేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ప్యారడైజ్ సినిమా విడుదలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీ సాయంత్రం వేళల్లో ప్రత్యేక షో నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, టికెట్ ధరను రూ.400గా ఖరారు చేశారు. అలాగే మల్టీప్లెక్స్‌లలో రూ.75, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతించడంతో పాటు అక్టోబర్ 3 వరకు రోజుకు ఐదు ప్రదర్శనలకు వెసులు కల్పించింది.