రైల్వేకోడూరులో గడపగడపకూ వెళ్లి ఓట్లడుగుతూ దూసుకుపోతున్న కూటమి అభ్యర్థి రెహమాన్
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: రైల్వే కోడూరు
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని 15 మరియు 16 వార్డుల పరిధిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి అబ్దుల్ రెహమాన్ షేక్ ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతి గడపగడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ తనకు మద్దతు తెలపాలని కోరారు. స్థానిక సమస్యలన్నింటినీ తాను దగ్గరుండి పరిష్కరిస్తానని ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.