మస్కట్ లో చిక్కుకున్న మహిళ రక్షణ: కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి రాక
రిపోర్టర్: శివ
స్థలం: వికారాబాద్
మస్కట్ లో ఏజెంట్ల చేతిలో మోసపోయి తీవ్ర ఇబ్బందులు పడిన వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి చెందిన తుప్పుడు లక్ష్మి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో సురక్షితంగా స్వదేశానికి చేరుకుందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలి కుమారుడు రాజు చేసిన విజ్ఞప్తిపై స్పందించిన కేటీఆర్ ఎంబసీ అధికారులతో మాట్లాడి ఆమెను రక్షించారని, హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో కేటీఆర్ను కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.