రాజాపేటలో కిరాణా దుకాణంలో చోరీ: నగదు అపహరణపై కేసు నమోదు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట గ్రామంలో ఓ కిరాణా దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పక్క తలుపును బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు పెట్టెలో ఉన్న పన్నెండు వేల రూపాయల నగదును అపహరించుకెళ్లారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేసినట్లు తెలిపారు.