జియో ప్లాట్ఫామ్స్ ఐపీఓకు భారీ డిమాండ్: రూ. రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
జియో ప్లాట్ఫామ్స్ ప్రతిపాదిత తొలి పబ్లిక్ ఇష్యూకు భారీగా డిమాండ్ లభించిందని మనీ కంట్రోల్ నివేదిక వెల్లడించింది. ఈ ఐపీఓలో దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ముందుకు వచ్చారు. బ్లాక్రాక్, ఎల్ఐసీ వంటి ప్రముఖ గ్లోబల్ ఆస్తి నిర్వహణ సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్లు, భారత ఆర్థిక సంస్థలు షేర్ల కేటాయింపును కోరుతున్నట్లు ఆ నివేదిక పేర్కొంది.