గూడూరులో హాల్మార్క్ లేని బంగారం విక్రయం: వాణిజ్యపన్నుల శాఖ మొద్దునిద్ర
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Guduru
గూడూరులో హాల్మార్క్ లేని బంగారం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని, వాణిజ్యపన్నులు మరియు తూనికలు కొలతల శాఖల అధికారులు మొద్దునిద్ర వీడాలని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ దాడుల్లో దొరికినా అధికారుల తీరు మారలేదని, జీఎస్టీ ఎగ్గొడుతూ వినియోగదారులను మోసగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. డిజిటల్ త్రాసుల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.