శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా గణేశుడి నిమజ్జనోత్సవం

రిపోర్టర్: గోపి స్థలం: శ్రీ సత్యసాయి జిల్లా

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో గరిడి గణేశ్ సేవా సమితి 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగింది. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విగ్రహం చేరుకోగానే నిర్వాహకులు బెంగళూరు నుంచి తెప్పించిన హెలికాప్టర్ ద్వారా గణనాథుడికి ఆకాశం నుంచి అద్భుతమైన పుష్పాభిషేకం నిర్వహించారు. ఈ పూల వర్షాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.