న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సభ్యత్వం కోసం ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు

రిపోర్టర్: గోపి స్థలం: న్యూఢిల్లీ

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ సభ్యత్వం కోసం ఇరాన్ తన ప్రయత్నాలను వేగవంతం చేసింది. దీనికి కొన్ని దేశాల మద్దతు లభించిందని, సభ్యత్వానికి అవసరమైన విధివిధానాలను పూర్తి చేసే పనిలో ఉన్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న ఆయన, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరిపిన భేటీని బలమైనదిగా అభివర్ణించారు.