రాజాపేటలో ఉత్తమ ఉపాధ్యాయుల ఘన సత్కారం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలంలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఐదుగురు ఉపాధ్యాయులను శనివారం ఘనంగా సత్కరించారు. ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, అదనపు కలెక్టర్ భాస్కరరావు, డీఈఓ భిక్షపతి పాల్గొని వీరికి ప్రశంసా పత్రాలను అందజేశారు.

బల్ల వెంకటేశ్వర్లు, ఏ. అనిత, పి. రాజు, బి. స్వరూప, టి. సంధ్యారాణిలను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, విద్యా రంగంలో ఉపాధ్యాయుల కృషి ఎంతో కీలకమని కొనియాడారు.