మాషా అల్లా స్క్రబ్బర్ స్కాం: విచారణలో మౌనం వీడని నిందితులు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
రూ. 22 కోట్ల మాషా అల్లా స్క్రబ్బర్ మోసాల కేసులో ప్రధాన నిందితులు అంకుశం రాజా, సుమ దంపతులను పోలీసులు ఐదు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు విచారణలో భాగంగా అధికారులు 50కి పైగా ప్రశ్నలు సంధించినా, నిందితులు ఏమీ తెలియదంటూ మొండిగా మౌనం వహించారు. నిధుల మళ్లింపు, ఇతర పాత్రధారుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా, నిందితుల తీరుతో దర్యాప్తులో పురోగతి మందగించింది.