అమరావతిలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు భూమిపూజ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: గుంటూరు

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అబ్బరాజుపాలెం వద్ద ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో 12 ఎకరాల్లో నిర్మించే ఈ సంస్థ ఏడాదికి 3 లక్షల మందికి ప్రపంచశ్రేణి వైద్యం అందించడంతో పాటు పరిశోధన, శిక్షణ కేంద్రంగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు.