చెన్నైలో కలకలం: కుమారుడి సినిమా స్పెషల్ షోకు సీఎం విజయ్ సతీమణి సంగీత
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చెన్నై
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిగ్మా సినిమా ప్రత్యేక ప్రదర్శనను తిలకించేందుకు సీఎం విజయ్ సతీమణి సంగీత చెన్నైలోని కమల్ థియేటర్‌కు విచ్చేశారని మీడియా వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా వ్యక్తిగత వార్తల నేపథ్యంలో మీడియాకు దూరంగా ఉంటున్న ఆమె, కొడుకు ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఆదరించేందుకు నేరుగా థియేటర్‌కు రావడం కోలీవుడ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.