జగిత్యాల పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే: అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు

రిపోర్టర్: రాజేష్ స్థలం: జగిత్యాల

జిల్లా ప్రజల సౌకర్యార్థం జగిత్యాల పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి అర్జీదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని SP JAGTIAL వెల్లడించారు. ఈ సందర్భంగా బాధితుల నుండి వచ్చిన వినతులను స్వయంగా పరిశీలించి వారి సమస్యలను తెలుసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వాటిని చట్టప్రకారం సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఖరాఖండీగా ఆదేశించినట్లు స్పష్టం చేశారు.