అసెంబ్లీకి దూరంగా కొండా సురేఖ.. రాజకీయాల్లో తీవ్ర చర్చ

రిపోర్టర్: సతీష్ స్థలం: తెలంగాణ

మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత మాజీ మంత్రి కొండా సురేఖ అసెంబ్లీ సమావేశాలకు, సీఎల్పీ భేటీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పార్టీలోనే కొనసాగుతానని చెబుతున్నప్పటికీ, కీలక కార్యక్రమాలకు హాజరుకాకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మాజీ ఓఎస్డీ వ్యవహారంలో పోలీసు వేధింపులు, అధిష్టానం వైఖరిపై ఆమె తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తోంది.