ఏపీ తీరం దిశగా దూసుకొస్తున్న వాయుగుండంతో భారీ వర్షాల ముప్పు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారి ఏపీ తీరం వైపు కదిలే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం సహా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.