పలాస ఎంపీపీ పదవీకాలం ముగింపు సందర్భంగా అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ఉంగ ప్రవీణ

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

పలాస మండల పరిషత్ అధ్యక్షురాలిగా తనకు అవకాశం కల్పించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు, సహకరించిన నాయకులు, కార్యకర్తలు, అధికారులకు ఎంపీపీ ఉంగ ప్రవీణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల ప్రయాణంలో ప్రజా సేవ చేసేందుకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలియజేస్తూ, మండల అభివృద్ధికి అందరితో కలిసి పనిచేశానని పేర్కొన్నారు.