చరిత్రలో వింత ఘటన: పోస్టల్ పార్శిల్ ద్వారా బాబును పంపిన తల్లిదండ్రులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Batavia
గతంలో అమెరికాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఒహియో రాష్ట్రానికి చెందిన జెస్సే మరియు మథిల్డా బీగల్ దంపతులు తమ ఎనిమిది నెలల కుమారుడు జేమ్స్‌ను బామ్మ వద్దకు చేర్చేందుకు రైలు టికెట్ కొనుగోలు చేయకుండా ఓ సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్ పార్శిల్ విధానాన్ని ఉపయోగించి కేవలం పదిహేను సెంట్ల పోస్టేజీ చెల్లించి బేబీని మేల్ క్యారియర్ ద్వారా పంపినట్లు చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయని పరిశోధకులు స్పష్టం చేశారు.