ఏలూరు జిల్లాలో దారుణం: ఇంట్ లో ఒంటరిగా ఉన్న యువతిపై కత్తితో దాడి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: ఏలూరు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఇంట్ లో ఒంటరిగా ఉన్న యువతిపై రామకృష్ణ అనే నిందితుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని స్థానికులు తెలిపారు. పోలవరం మండలం తంగేడికొండ ప్రాంతానికి చెందిన బాధితురాలి కేకలు విన్న చుట్టుపక్కల ప్రజలు అక్కడికి చేరుకునేలోపే నిందితుడు పరారయ్యాడు. రక్తమడుగులో ఉన్న యువతిని స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.